బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ: ఎమ్మెల్సీ కవిత వెల్లడి

  • ఈ నెల 23న ప్రదర్శించేందుకు నిర్ణయం
  • ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రయత్నాలు
  • బతుకమ్మ సినిమా చేస్తానని గౌతమ్ మేనన్ అన్నారు
బతుకమ్మ ఖ్యాతి ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా.. ఖండాంతరాలు దాటించేందుకు ప్రయత్నం చేస్తున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ  కవిత అన్నారు. అందులో భాగంగానే ఏటా ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. ‘అల్లిపూల బతుకమ్మ’ పాటకు సంబంధించి కవిత, గౌతమ్ మేనన్ లను నటులు ప్రియదర్శి, రాహుల్ రాజ్ ఇంటర్వ్యూ చేశారు.

బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసేందుకే అల్లిపూల బతుకమ్మ పాటను గౌతమ్ మేనన్, ఏఆర్ రెహ్మాన్ తో కలిసి చిత్రీకరించినట్టు కవిత చెప్పారు. ఈ పాట చేశాక.. బతుకమ్మ మీద సినిమా చేసేందుకు గౌతమ్ మేనన్ ఆసక్తి చూపించారని తెలిపారు. ఇలాంటి కొత్త ప్రయోగాలతోనే బతుకమ్మ ఖ్యాతి పెరుగుతుందని చెప్పారు.

ప్రపంచం మొత్తానికి బతుకమ్మ తెలిసేలా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. రెండేళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నా కరోనా మహమ్మారితో సాధ్యపడలేదన్నారు.


More Telugu News