'చోర్ బజార్'తో గెహన సిప్పీ ఎంట్రీ .. ఫస్టులుక్ రిలీజ్!
- ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్'
- కథానాయికగా గెహనా సిప్పీ పరిచయం
- మాస్ మెచ్చే కథాకథనాలు
- దర్శకుడిగా జీవన్ రెడ్డి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. ఈ చిత్రంతో గెహన సిప్పీ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. 'దళం' .. 'జార్జ్ రెడ్డి' సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'చోర్ బజార్' చిత్రంలో సిమ్రన్ పాత్రలో గెహన సిప్పీ ఆకట్టుకోనుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందంగా నడిచొస్తున్న ఆమె, గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోబోతోంది. నిర్మాణాంతర కార్యక్రమాల తుది దశలో ఉన్న 'చోర్ బజార్' సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్స్ డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను, పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను, స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో - జీఎస్కే మీడియా, మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా - టాక్ స్కూప్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ - ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి .
లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'చోర్ బజార్' చిత్రంలో సిమ్రన్ పాత్రలో గెహన సిప్పీ ఆకట్టుకోనుంది. ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందంగా నడిచొస్తున్న ఆమె, గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోబోతోంది. నిర్మాణాంతర కార్యక్రమాల తుది దశలో ఉన్న 'చోర్ బజార్' సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్స్ డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను, పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను, స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో - జీఎస్కే మీడియా, మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా - టాక్ స్కూప్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ - ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి