ఇక చాలు ఆపండి: 'మా' ఎన్నిక‌ల తీరుపై రోజా

  • విద్వేష రాజకీయాలు వ‌ద్దు
  • పక్క నుంచి మాట్లాడేవారి వల్లే  గొడవలు
  • ఎవ‌రూ ఎవ‌రికీ శ‌త్రువులు కాదు
  • అంద‌రిదీ ఒకే కుటుంబం
'విద్వేష రాజకీయాలు ఇక చాలు.. ఇక్కడితో ఆపండి.. పక్క నుంచి మాట్లాడేవారి వల్లే గొడవలు జరుగుతున్నాయి' అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా సినీన‌టి, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల సంద‌ర్భంగా జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన్న విషయం తెలిసిందే. దీనిపై  రోజా స్పందించారు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న ఎవ‌రూ ఎవ‌రికీ శ‌త్రువులు కాద‌ని చెప్పారు.

అంద‌రిదీ ఒకే కుటుంబ‌మ‌ని, క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా క‌నిపించ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు. మాలో ఉన్న 900మంది మాత్రమేన‌ని గుర్తు చేశారు.  మంచి వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరు గెలిచినా తెలంగాణ‌, ఏపీ ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాన‌ని చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్‌లో త‌న‌తో క‌లిసి పనిచేసిన నటులు ఉన్నారని ఆమె తెలిపారు.



More Telugu News