సీఎం కేసీఆర్‌పై వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు

  • 108 వాహనాల పర్య‌వేక్ష‌ణ‌పై మండిపాటు
  •  420 వాహనాల్లో 100 మాత్రమే న‌డుస్తున్నాయి
  • ఆయా వాహనాలకు డ్రైవర్లు లేరు
  • ఉన్న డ్రైవ‌ర్ల‌కు కూడా జీతాలు ఇవ్వడం లేదు
తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల మ‌రోసారి మండిప‌డ్డారు. 108 వాహనాలపై ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు ప‌ట్ల ఆమె స్పందించారు. ఆ వాహ‌నాల‌పై పర్యవేక్షణ లేదని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తం 420 వాహనాలు ఉంటే, ప్ర‌స్తుతం సేవ‌లు అందిస్తున్న‌వి 100 మాత్రమే అని ఆమె ఆరోపించారు.

ఆయా వాహనాలకు డ్రైవర్లు లేరని, ఉన్న డ్రైవ‌ర్ల‌కు కూడా జీతాలు ఇవ్వడం లేదని ఆమె చెప్పారు. అంతేగాక‌, 108 వాహనాలు మారుమూల ప్రాంతాల‌ ప్రజల వద్దకు చేరాలంటే సరైన రోడ్లు కూడా లేవని ఆమె తెలిపారు. పేద ప్ర‌జ‌ల‌కు వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయ‌ని చెప్పారు. ప్రజల ప్రాణాలను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆరోపించారు.



More Telugu News