కాసేపు 'మా' పోలింగ్ ఆపేసిన అధికారులు
- ప్యానెల్ సభ్యులు పరస్పరం ఆరోపణలు
- పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తి
- మంచు విష్ణు ఆగ్రహం
- ప్రకాశ్ రాజ్ గన్‌మన్లను బయటకు పంపిన అధికారులు
హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్ద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ జరుగుతోన్న సమయంలో గందరగోళం చోటు చేసుకుంటుండడం గమనార్హం. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, వాగ్వివాదం చోటు చేసుకోవడంతో దాదాపు 10 నిమిషాల పాటు అధికారులు పోలింగ్ నిలిపివేశారు.
పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తి వచ్చాడంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్‌మన్‌లు పోలింగ్ కేంద్రంలోకి ఎందుకు వచ్చారంటూ విష్ణు ప్యానెల్ అభ్యంతరాలు తెలిపింది. దీంతో ప్రకాశ్ రాజ్ గన్‌మన్లను అధికారులు బయటకు పంపించారు. ప్రకాశ్ రాజ్, నరేశ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో వారిని మోహన్ బాబు సముదాయించారు. ప్రస్తుతం పోలింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు 220 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.