అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి.. తెలంగాణ యువత డిమాండ్ల రోజు: కోదండరాం
- యువజన విద్యార్థి ముఖ్య నాయకులతో కోదండరాం సమావేశం
- దసరా తర్వాత ఉద్యోగ, ఉపాధి సాధనకు జిల్లాల వారీగా సదస్సులు
- ఉద్యోగాల విషయంలో కేసీఆర్ అబద్ధాలు
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వర్ధంతిని విద్యార్థి, నిరుద్యోగ యువతతో కలిసి తెలంగాణ యువజన డిమాండ్ల రోజుగా నిర్వహిస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరాం తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిన్న యువజన విద్యార్థి ముఖ్య నాయకులతో కోదండరాం సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ, యువత సమస్యల పరిష్కారానికి ముసాయిదా రూపొందిస్తామని, దసరా తర్వాత ఉద్యోగ, ఉపాధి సాధనకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేసి 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. నిరుద్యోగులు ధైర్యంగా పోరాడాలని, బలవన్మరణాలకు పాల్పొడద్దని పిలుపునిచ్చారు.