జైలులోని 85 మందికి హెచ్ఐవీ పాజిటివ్.. షాకవుతున్న అధికారులు

  • అస్సాంలోని నౌగావ్ జిల్లా సెంట్రల్ జైలులో ఘటన
  • గత నెలలో ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు
  • వీరందరూ డ్రగ్స్‌కు బానిసలేనన్న వైద్యాధికారులు
జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో ఏకంగా 85 మంది హెచ్ఐవీ బారినపడడం జైలు అధికారులతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అస్సాంలోని నాగావ్ జిల్లా సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగుచూసింది. గత నెలలో ఇక్కడి ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏకంగా 85 మందికి హెచ్ఐవీ సోకినట్టు తేలడంతో అధికారులు విస్తుపోయారు.

అయితే, వీరంతా డ్రగ్స్‌కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడే సిరంజీల కారణంగానే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు.


More Telugu News