కదులుతున్న రైలులో యువతిపై దోపిడీ దొంగల గ్యాంగ్ రేప్
- లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘటన
- డి-2 స్లీపర్‌లో ప్రయాణికుల నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోపిడీ
- నలుగురు నిందితుల అరెస్ట్.. మరో నలుగురి కోసం గాలింపు
కదులుతున్న రైలులోకి చొరబడిన దోపిడీ దొంగలు దారుణానికి తెగబడ్డారు. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. మహారాష్ట్రలోని సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే ఇగత్‌పురి-కాసర రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
డి-2 స్లీపర్ బోగీలోకి ప్రవేశించిన 8 మంది దొంగలు మారణాయుధాలు చూపించి 20 మంది ప్రయాణికుల నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్నారు. ఈ క్రమంలో ఓ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు కాసర రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు.