తన పీఏ సోదరుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్
- కేటీఆర్ వద్ద పీఏగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి
- ఇటీవల మహేందర్ రెడ్డి సోదరుడు మృతి
- తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు
- అండగా ఉంటామన్న కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్ద పీఏగా మహేందర్ రెడ్డి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల మహేందర్ రెడ్డి సోదరుడు అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన పీఏ మహేందర్ రెడ్డి సోదరుడి నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్తుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.