'కొండ పొలం' సుకుమార్ తీయాలనుకున్నాడట!
- క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కొండ పొలం'
- నవల ఆధారంగా రూపొందిన సినిమా
- అడవి నేపథ్యంలో సాగే కథ
- సుకుమార్ అందుకే చేయలేదట
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కొండ పొలం' రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఒక నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి, కథాకథనాలతో పాటు సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది.
అయితే ఈ 'కొండ పొలం' అనే నవలను సినిమా తీయాలనే ఆలోచన ముందుగా చేసింది సుకుమార్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. సుకుమార్ తనకి ఏ మాత్రం ఖాళీ దొరికినా పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అలా 'కొండ పొలం' నవల చదివిన ఆయన, ఆ నవలను ఒక ప్రయోగాత్మక సినిమాగా తీయాలనుకున్నాడట.
'పుష్ప' రెండు భాగాలు చేయవలసి రావడంతో, ఇక ఆయన ఆ ఆలోచనను మానుకున్నాడట. అంతే కాకుండా రెండు కథలు అడవి నేపథ్యంలోనివే అవుతాయని భావించాడని అంటున్నారు. ఇక ఈ పుస్తకాన్ని తన దృష్టికి తెచ్చింది సుకుమార్ .. హరీశ్ శంకర్ అని క్రిష్ చెప్పాడు కూడా. ఒకవేళ ఈ కథను సుకుమార్ చేసి ఉంటే ఎలా ఉండేదో!