బూట్లలో పెట్టి డ్రగ్స్ తీసుకెళ్లాం.. మేం చరస్ తీసుకున్నాం: పోలీసుల విచారణలో ఆర్యన్ ఖాన్

  • పంచనామాలో వెల్లడించిన ఎన్సీబీ
  • ఆరు గ్రాముల చరస్  సీజ్
  • ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో పంచనామా చేశామని వెల్లడి
డ్రగ్స్ తీసుకున్నట్టు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. ముంబై తీరంలోని ఓ విలాసవంతమైన క్రూయిజర్ పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆర్యన్ ఖాన్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే తాను, తన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ చరస్ (గంజాయి) తీసుకున్నామని విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అంతేగాకుండా క్రూయిజర్ లో మత్తులో ఊగిపోయేందుకు బూట్లలో పెట్టుకుని దానిని తీసుకెళ్లామని చెప్పాడట. అరెస్టులు, రెయిడ్ల సమయంలో కిరణ్ గోసావి, ప్రభాకర్ రఘోజి సేన్ అనే ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో ఆర్యన్, అర్బాజ్ ల వాంగ్మూలాలతో కేసు పంచనామాను రూపొందించినట్టు తెలుస్తోంది.  

రెయిడ్ల సందర్భంగా వారికి ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 50 గురించి వారికి ఎన్సీబీ అధికారి ఆశిష్ రాజన్ ప్రసాద్ వివరించినట్టు పంచనామాలో ఎన్సీబీ పేర్కొంది. ఉన్నతాధికారులు వచ్చి రెయిడ్ చేయకముందే తమను సెర్చ్ చేయనివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినా.. ఆ ఇద్దరు యువకులు నిరాకరించారని తెలిపింది. డ్రగ్స్ ఏవైనా ఉన్నాయా? అని అడిగితే తమ వద్ద ఆరు గ్రాముల చరస్ ఉందని వారు చెప్పారని వెల్లడించింది. తన బూట్లలో పెట్టిన జిగటగా ఉన్న నల్లటి పదార్థాన్ని అర్బాజ్ తీసి ఇచ్చాడని, చెక్ చేస్తే అది చరస్ అని తేలిందని పేర్కొంది.


More Telugu News