ఎట్టకేలకు లఖింపూర్ హింస ఘటనలో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి కుమారుడు.. వీడియో ఇదిగో
- విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక
- క్రైం బ్రాంచ్ ఆఫీస్ కు వచ్చిన ఆశిష్ మిశ్రా
- కొనసాగుతోన్న విచారణ
యూపీలోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఆయన పోలీసుల విచారణకు నిన్న గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆయన విచారణకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించగా మాట్లాడకుండానే క్రైం బ్రాంచ్ ఆఫీస్ లోపలికి వెళ్లారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రాను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే ఎవరినీ అరెస్టు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.