సెక్రటేరియట్ ముందు వీరు అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సిరావడం దురదృష్టకరం: టీడీపీ నేత సోమిరెడ్డి
- కాంట్రాక్టర్లు బిల్లుల కోసం నిరసన
- అభివృద్ధికి ఆలంబనం కాంట్రాక్టర్లే
- రోడ్డు వేయాలన్నా, భవనం కట్టాలన్నా వాళ్లు కావాలి
- మా అవస్థ చూడండి మహా ప్రభో అని పాలకులకు మొరపెట్టుకొనే దుస్థితి
అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల కోసం అమరావతిలో సెక్రటేరియట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారని ఓ దినపత్రికలో వచ్చిన వార్తను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోస్ట్ చేశారు. ఇటువంటి దుస్థితికి వారిని తీసుకురావడం ఏంటని ఏపీ సర్కారుపై ఆయన మండిపడ్డారు.
'కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అమరావతిలో సెక్రటేరియట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సిరావడం దురదృష్టకరం. అభివృద్ధికి ఆలంబనం కాంట్రాక్టర్లే. రోడ్డు వేయాలన్నా, భవనం కట్టాలన్నా, ప్రాజెక్ట్ నిర్మించాలన్నా వాళ్లు కావాలి. అప్పో సప్పో చేసి ముందుగా పెట్టుబడి పెట్టి, పని జరిపిస్తారు' అని సోమిరెడ్డి పేర్కొన్నారు.
'కాంట్రాక్టర్లు సగం బట్టలు విప్పి మా అవస్థ చూడండి మహా ప్రభో అని పాలకులకు మొరపెట్టుకొనే దుస్థితికి నెట్టడం మంచి పద్ధతి కాదు. ఈ రోజు అర్ధనగ్నంగా కనిపించిన కాంట్రాక్టర్లు రేపు మరో అడుగు వేయకముందే బిల్లులు చెల్లించి వారి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉంది' అని సోమిరెడ్డి అన్నారు.