భారీ వర్షానికి రోడ్డుపై వరద.. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- గత రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం
- కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద వరదనీటిలో చిక్కుకుపోయిన లారీ
- ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
హైదరాబాద్‌లో గత రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్ డౌన్ కారణంగా వరదనీటిలో చిక్కుకుపోవడంతో హైదరాబాద్-బెంగళూరు రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుకు అటుఇటు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, అరాంఘర్-శంషాబాద్ రహదారిపైనా ఇలాంటి పరిస్థితే నెలకొంది.