హుజూరాబాద్ ఎన్నికల ఎఫెక్ట్.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
- ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
- 29న జరగాల్సిన పరీక్షలను 31కి, 30న జరగాల్సిన పరీక్షలను నవంబరు 1వ తేదీకి వాయిదా
- విద్యార్థులు గమనించాలన్న ఇంటర్‌బోర్డు
ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో తెలంగాణ ఇంటర్‌బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇది వరకే బోర్డు ప్రకటించింది. అయితే, ఆ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కొన్ని పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.
ఈ నెల 29న భౌతికశాస్త్రం, ఆర్థిక శాస్త్రం పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని ఈ నెల 31న ఆదివారం, 30న జరగాల్సిన రసాయనశాస్త్రం, కామర్స్ పరీక్షలను నవంబరు 1న జరుపుతామని బోర్డు ప్రకటించింది. నవంబరు 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు గణితం, 3న జాగ్రఫీ, మోడర్న్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.