పరీక్ష రాయకముందే ఫెయిల్ అయ్యానంటూ 'మా' సభ్యత్వానికి రాజీనామా చేసిన సీవీఎల్
- ఇటీవల మా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీవీఎల్
- ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడి
- ఏకగ్రీవం కాకపోతే 'మా'కు రాజీనామా చేస్తానని వివరణ
- చెప్పినట్టుగానే రాజీనామా
- బీజేపీకి కూడా రాజీనామా చేసిన వైనం
'మా' ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు.
ఇటీవలే సీవీఎల్ 'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అనూహ్యరీతిలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, 'మా' అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఏకగ్రీవం అయ్యేందుకు ప్రయత్నాలు విఫలమైతే తాను 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లో సీవీఎల్ రాజీనామా చేశారు. పరీక్ష రాయడానికి ముందే ఫెయిల్ అయ్యానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తాను ఓటు వేయడంలేదని స్పష్టం చేశారు.
అంతేకాదు, బీజేపీకి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. బురదలో ఉన్నా వికసించేందుకు తాను కమలాన్ని కానని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తనను క్షమించాలని కోరారు.