వంద‌ల మంది నామినేషన్లు వేయడానికి హుజూరాబాద్‌ వస్తే అడ్డుకుంటున్నారు: ష‌ర్మిల‌

  • మేము ఇచ్చిన పిలుపు మేరకు నిరుద్యోగులు వెళ్లారు
  • కేసీఆర్ గారు, మీకు ఎందుకు అంత భయమైతోంది?
  • ఇక్కడ మీ పరువు పోతుందని భయపడుతున్నారా?
  • లేక మీరు ఓడిపోతారని భయపడుతున్నారా?
హుజూరాబాద్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్ వేయ‌డానికి వ‌చ్చిన‌ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు నిరుద్యోగుల‌ను పోలీసులు అడ్డుకున్నారంటూ వ‌చ్చిన ఓ వార్త‌ను పోస్ట్ చేస్తూ తెలంగాణ స‌ర్కారుపై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.  

'మేము ఇచ్చిన పిలుపు మేరకు హుజూరాబాద్‌లో వందల మంది నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయడానికి వస్తే  అడ్డుకుంటున్నారు. అయ్యా కేసీఆఆర్ గారు మీకు ఎందుకు అంత భయమైతోంది? ఇక్కడ మీ పరువు పోతుందని భయపడుతున్నారా? లేక మీరు ఓడిపోతారని భయపడుతున్నారా? అందుకే అడ్డుకుంటున్నారా?' అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

'ప్రజల కోసం పనిచేయాల్సిన‌ పోలీసులు కేసీఆర్ గారికి తొత్తులా మారారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్.. కేసీఆర్ గారికి అమ్ముడుపోయారు. కేసీఆర్.. మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా మిమ్మల్ని నిరుద్యోగిని చేసేవరకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేవరకు మా ఈ పోరాటం ఆగదు' అని ష‌ర్మిల హెచ్చరించారు.


More Telugu News