అత్యాచార బాధిత బాలికపై నింద మోపే విధంగా పోలీసులు మాట్లాడడం దురదృష్టకరం: నాదెండ్ల మనోహర్
- విశాఖలోని అగనంపూడి, శనివాడలో బాలిక మృతి
- అత్యాచారం, మృతి ఘటన తీవ్రంగా కలచి వేసింది
- పోలీసు శాఖ చేసిన ప్రకటన ఆ కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేస్తోంది
- వాస్తవాలను వెలికి తీయాలి
విశాఖలోని అగనంపూడి, శనివాడలో మంగళవారం రాత్రి అదృశ్యమైన ఓ బాలిక (13) తాము ఉంటోన్న అపార్ట్‌మెంట్ వద్ద విగతజీవిగా కనపడడం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ఓ ప్రకటన చేశారు.
'మైనర్ బాలికపై అత్యాచారం, మృతి ఘటన తీవ్రంగా కలచి వేసింది. ఈ దుర్ఘటనపై పోలీసు శాఖ చేసిన ప్రకటన ఆ బాలిక కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేస్తోంది. బాలికపై నింద మోపే విధంగా మాట్లాడడం దురదృష్టకరం. వాస్తవాలను వెలికి తీయడంతో పాటు, తల్లిదండ్రులు, బంధువులు వ్యక్తం చేస్తోన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన పేర్కొన్నారు. బాలిక కుటుంబ సభ్యుల న్యాయపోరాటంతో తాము మద్దతుగా ఉంటామని తెలిపారు.