డ్రగ్స్ కేసులో ఏపీ సర్కారుపై చేసిన ఆరోపణలపై మరోసారి స్పందించిన ధూళిపాళ్ల
- వేల కోట్ల డ్రగ్స్ దొరికితే జగన్ తీరిగ్గా స్పందించారు
- విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఉండరాదని అన్నారు
- దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది
- ఇన్నాళ్లూ విద్యా సంస్థల్లో మత్తుపదార్థాలు ఉన్నాయా?
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్టులో బోటు తగలబడినప్పుడు డ్రగ్స్ వాసన వచ్చినట్లు సమాచారం అందిందని అన్నారు.
దీంతో ఇదే సమాచారంతో తాను మీడియాతో మాట్లాడానని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికితే సీఎం జగన్ మాత్రం తీరిగ్గా స్పందించారని ఆయన అన్నారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఉండరాదని ఆయన చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని ధూళిపాళ్ల చెప్పారు. ఇన్నాళ్లూ విద్యా సంస్థల్లో మత్తుపదార్థాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని తెలిపారు.