సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • థియేటర్లోనే చూడాలంటున్న శ్రుతి 
  • బాలకృష్ణ టాక్ షోకి టైటిల్ ఖరారు
  • మహేశ్ కొత్త సినిమా అప్ డేట్
*  కొన్ని సినిమాలు థియేటర్లలోనే చూడాలి.. అప్పుడే ఆ మజా ఉంటుంది అంటోంది కథానాయిక శ్రుతి హాసన్. థియేటర్.. ఓటీటీలలో  దేనికి మీ ఓటు వేస్తారు? అంటే ఈ చిన్నది అలా చెప్పింది. 'చాలా సినిమాలు థియేటర్లోనే చూడాలి. అప్పుడే అనుభూతి కలుగుతుంది. కొన్ని రకాల సినిమాలు మాత్రమే ఓటీటీలో చూడగలుగుతాం. అన్ని సినిమాలూ ఓటీటీలో చూడలేం' అని చెప్పింది శ్రుతి.
*  నందమూరి బాలకృష్ణ త్వరలో 'ఆహా' ఓటీటీ వేదిక కోసం ఒక టాక్ షో చేయనున్న విషయం తెలిసిందే. ఈ షోకు 'అన్ స్టాపబుల్' అనే టైటిల్ ను నిర్ణయించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్ల చిత్రీకరణ మొదలవుతుందట.
*  ప్రస్తుతం మహేశ్ బాబు చేస్తున్న 'సర్కారువారి పాట' చిత్రం షూటింగ్ వచ్చే నెలలో పూర్తవుతుంది. ఆ వెంటనే పెద్దగా బ్రేక్ తీసుకోకుండానే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగులో మహేశ్ జాయిన్ అవుతారట. ఇందులో పూజ హెగ్డే ఆయన సరసన జోడీగా నటిస్తుంది.


More Telugu News