షారుఖ్ తనయుడికి రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీ
- డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్
- నేటితో ముగిసిన ఎన్సీబీ కస్టడీ
- ఈ నెల 11 వరకు కస్టడీకి అప్పగించాలన్న ఎన్సీబీ
- నిరాకరించిన ముంబయి కోర్టు
- నిర్బంధ విచారణ అవసరం లేదని స్పష్టీకరణ
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ముంబయి కోర్టు రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్ కు నేటితో ఎన్సీబీ కస్టడీ ముగియగా, మరో నాలుగు రోజులు కస్టడీకీ అప్పగించాలని ఎన్సీబీ చేసుకున్న విజ్ఞప్తిని సిటీ కోర్టు తోసిపుచ్చింది. నిర్బంధ విచారణ అవసరంలేదని పేర్కొంది.
కాగా, ఆర్యన్ ఖాన్ కు 14 రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడే ఉన్న షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీ కంటతడి పెట్టారు. ఇక, ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనుంది. బెయిల్ పై న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.