ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉండదు: రఘురామకృష్ణరాజు
- అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపై మా ప్రభుత్వం ఆలోచిస్తోంది
- ఆర్ అండ్ బీ ఆస్తులపై అప్పులు తీసుకోవాలనుకుంటోంది
- రిటైర్డ్ ఉద్యోగులకు సమయానికి పెన్షన్ రావడం లేదు
అప్పులు ఎలా తీసుకురావాలనే దానిపై తమ ప్రభుత్వం కొత్త కొత్త కోణాల్లో ఆలోచిస్తోందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రుణ యజ్ఞం పేరుతో అప్పులు తీసుకొస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏపీ స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కింద రూ. 3 వేల కోట్ల రుణం తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా ఒక జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్ అండ్ బీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావాలనుకుంటోందని అన్నారు.
అసలు ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉండదని చెప్పారు. చెత్త నుంచి సంపదను తయారు చేసే సెంటర్లకు కూడా వైసీపీ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు చివాట్లు పెట్టిందని అన్నారు. మూడు రంగులు వేసే పనులకు ముఖ్యమంత్రి జగన్ ముగింపు పలకాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏ అడుగుతున్నారని, వారి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు సరైన సమయానికి పెన్షన్ రావడం లేదని దుయ్యబట్టారు.