488 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

  • ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
  • 144 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 10 శాతానికి పైగా లాభపడ్డ టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ
ఆటో, ఐటీ సూచీల అండతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానుండటం... రేపు మానిటరీ పాలసీని ఆర్బీఐ ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

 ఈరోజు లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్... చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 488 పాయింట్లు లాభపడి 59,678కి చేరుకుంది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 17,790 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (10.63%), మహీంద్రా అండ్ మహీంద్రా (5.32%), మారుతి సుజుకి (3.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.02%), సన్ ఫార్మా (2.78%).

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.31%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.59%), నెస్లే ఇండియా (-0.58%), ఎన్టీపీసీ (-0.42%).


More Telugu News