వాట్సాప్ సరికొత్త ఫీచర్.. ‘ప్లేయర్’!
- వాయిస్ మెసేజ్ లు వినేందుకు తీసుకొస్తున్న సంస్థ
- చాట్ లో లేకుండానే వినేందుకు వీలు
- మెసేజ్ వింటూనే చాట్ చేసే అవకాశం
- ఇంకా ఎవరికీ అందుబాటులోకి రాలేదన్న వాట్సాప్ బీటాఇన్ఫో
వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. ఇటీవల ఆడియో మెసేజ్ లను వివిధ వేగాల్లో ప్లే చేసే ఫీచర్ ను తీసుకొచ్చిన సంస్థ.. ఇప్పుడు ఆడియో మెసేజ్ లను వినేందుకు ప్రత్యేకంగా ‘ప్లేయర్’ అనే కొత్త ఫీచర్ ను జోడిస్తోంది. ఇప్పటిదాకా ఏదైనా వాయిస్ మెసేజ్ ను వినాలంటే ఆ చాట్ లో కచ్చితంగా ఉండాల్సిందే. ఇకపై చాట్ లో లేకుండానే వాయిస్ మెసేజ్ ను వినేందుకు వీలుగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తున్నారు. వాట్సాప్ బీటాఇన్ఫో ప్రస్తుతం ఈ ఫీచర్ ను పరీక్షిస్తోంది.
వాట్సాప్ లో పైన ఉండే బార్ పై ‘ప్లేయర్’ను పిన్ చేసి ఉంచుతారు. దీంతో వాయిస్ మెసేజ్ లన్నీ అక్కడే స్టోర్ అయి ఉంటాయి. దీంతో చాట్ లోకి వెళ్లాల్సిన పనిలేకుండానే వాయిస్ మెసేజ్ ను అక్కడే వినేయొచ్చు. వేరే వారితో చాట్ చేసుకుంటూ కూడా వాయిస్ మెసేజ్ ను వినేందుకు వీలుంటుంది. వాట్సాప్ బీటా మాత్రం అదింకా అభివృద్ధి దశలోనే ఉందని చెబుతోంది. బీటా టెస్టర్లు సహా ప్రజలెవరికీ అది అందుబాటులో లేదని అంటోంది. ఈ ఫీచర్ కోసం మరికొన్నాళ్లు ఆగక తప్పదని పేర్కొంది.
కాగా, ‘మెసేజ్ డిసప్పియరింగ్’ ఫీచర్ నూ వాట్సాప్ టెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని ప్రకారం ఒక కాలపరిమితి తర్వాత వచ్చిన మెసేజ్ మాయమైపోతుంది. ఒక రోజు, వారం, 3 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం బీటా టెస్టర్లకు ఆ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘డీఫాల్ట్ మెసేజ్ టైమర్’ను సెట్ చేసుకోవచ్చు.