య‌డియూర‌ప్ప‌ సన్నిహితుడి ఇంటిపై ఐటీ దాడులు

  • తెల్ల‌వారుజాము నుంచే సోదాలు
  • అమిత్ ఉమేశ్ ఇళ్లు, ఆఫీసుల్లోనూ త‌నిఖీలు
  • ప్ర‌ధానంగా వ్యాపార‌వేత్త‌ల ఇళ్ల‌లో రైడ్స్
  • పాల్గొన్న 300 మంది అధికారులు
బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ దాడులు జ‌రుపుతుండ‌డంతో క‌ల‌కలం రేపుతోంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్‌ నివాసం, కార్యాల‌యాల్లోనూ ఈ దాడులు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఉమేశ్ తో పాటు ఆయ‌న బంధువులకు చెందిన మొత్తం ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్ప‌టికే అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, పన్ను ఎగవేత ఆరోపణలపై బెంగ‌ళూరులోని ప‌లువురి ఇళ్లు, కార్యాలయాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొన‌సాగుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే అధికారులు ఈ సోదాలు ప్రారంభించారు. 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్‌ చేసినట్లు తెలిసింది. బెంగ‌ళూరులో ముఖ్యంగా వ్యాపారవేత్తలు, చార్డెట్‌ అకౌంటెంట్ల నివాసాల్లో సోదాలు కొన‌సాగుతున్నాయి.


More Telugu News