మా పార్టీ గెలిచి ఉంటే ప్రతి డ్వాక్రా గ్రూపున‌కు 5 లక్షలు వచ్చేవి: బొండా ఉమ‌

  • డ్వాక్రా మహిళలను ప్ర‌భుత్వం మోసం చేస్తోంది
  • రూ.10 లక్షలు ఇస్తానని వైసీపీ చెప్పింది
  • రుణాల‌ను మొత్తం మాఫీ చేస్తామని తెలిపింది
  • ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌ట్లేదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ ఏపీ స‌ర్కారు కాలం గ‌డుపుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. డ్వాక్రా మహిళలను ప్ర‌భుత్వం మోసం చేస్తోంద‌ని ఆయ‌న విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ప్రతి డ్వాక్రా గ్రూపున‌కు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఆ హామీ మ‌రిచింద‌ని అన్నారు.

అంతేగాక‌, వైసీపీ గెలిస్తే రుణాల‌ను మొత్తం మాఫీ చేస్తామని చెప్పి, మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెలిచి ఉంటే ప్రతి గ్రూపుకు 5 లక్షలు వచ్చేవని ఆయ‌న చెప్పారు. తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో మహిళలకు రెండు సార్లు రెండు లక్షల రూపాయలు ఇచ్చామని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల ముందు వైసీపీ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలోని ప్రతి పథ‌కం బోగస్ అని ఆయ‌న విమర్శించారు. 


More Telugu News