అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించింది: ఏపీ గవర్నర్
- ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
- నవరాత్రుల సందర్భంగా తొలి పూజ చేసిన గవర్నర్
- కరోనా నుంచి అందరికీ ఉపశమనం కలగాలని కోరుకున్నానని వ్యాఖ్య
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. తన అర్ధాంగితో కలిసి ఆయన అమ్మవారి సేవలో పాల్గొన్నారు. గవర్నర్ దంపతుల రాక సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి గవర్నర్ దంపతులు తొలి పూజ చేశారు. గవర్నర్ తొలి పూజతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్పవాలు ప్రారంభమయ్యాయి.
దర్శనానంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కరోనా నుంచి ప్రజలందరికీ ఉపశమనం కలగాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.