రైల్వే ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటన
- 78 రోజుల శాలరీకి సమానమైన బోనస్
- ఖజానా మీద రూ. 1,984.73 కోట్ల భారం
- 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల శాలరీకి సమానమైన బోనస్ ను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఖజానా మీద రూ. 1,984.73 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
ఈ నిర్ణయంతో మొత్తం 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మేలు జరగనుంది. అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ ఈ ఆర్థిక సంవత్సరానికి 78 రోజులకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు ఈ బోనస్ ను చెల్లిస్తారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇస్తారు. కానీ ఈసారి 78 రోజుల బోనస్ ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.