అమిత్ షాతో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా భేటీ.. రాజీనామా చేయబోతున్నారా?

  • లఖింపూర్‌ ఖేరీ ఘటన తర్వాత రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
  • షాను కలవడానికి ముందు తన కార్యాలయంలో అరగంట పాటు గడిపిన మిశ్రా
  • రాజీనామా వార్తలకు బలం
దేశవ్యాప్తంగా సంచలనమైన లఖింపూర్‌ ఖేరీ ఘటన తర్వాత హోంమంత్రి అమిత్ షాతో మరోమంత్రి అజయ్ మిశ్రా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. లఖింపూర్‌ ఖేరీ రైతు నిరసనకారులపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, తదనంతర హింసలో మరో నలుగురు.. మొత్తం 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మిశ్రా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో అమిత్ షాతో మిశ్రా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా విషయాన్ని షాతో చర్చించేందుకే ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు. కాగా, షాను కలవడానికి ముందు అజయ్ మిశ్రా నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయంలో అరగంట పాటు గడిపినట్లు తెలుస్తోంది.


More Telugu News