జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్ ను వెనక్కి ఇచ్చిన హైకోర్టు రిజిస్ట్రీ

  • సాంకేతిక కారణాలతో పిటిషన్ ను వెనక్కిచ్చిన రిజిస్ట్రీ
  • బెయిల్ రద్దు చేయాలని తొలుత సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన రఘురాజు
  • పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన రఘురాజు
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే, పిటిషన్లను సాంకేతిక కారణాలతో హైకోర్టు రిజస్ట్రీ వెనక్కి ఇచ్చింది. దీంతో, రఘురాజు మరోసారి పిటిషన్ వేయనున్నారు.

జగన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో తొలుత రఘురాజు పిటిషన్లు వేశారు. అయితే తాము బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని... వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురాజు పిటిషన్ వేశారంటూ జగన్, విజయసాయి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో, రఘురాజు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో రఘురాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు.


More Telugu News