పదో తరగతిలో ‘అమరావతి’ పాఠాన్ని తొలగించిన ఏపీ ప్రభుత్వం

  • అమరావతి పేరుతో 2014లో పాఠ్యాంశం
  • నూతనంగా ముద్రించిన పుస్తకాల్లో కనిపించని పాఠం
  • 11 పాఠాలతోనే కొత్త పుస్తకం
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న మరో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పదో తరగతిలో చేర్చిన ‘అమరావతి’ పాఠ్యాంశాన్ని తొలగించింది. 2014లో 12 పాఠ్యాంశాలతో పదో తరగతి పాఠ్యపుస్తకాన్ని ముద్రించారు. ఇందులో సాంస్కృతిక వైభవం కింద రెండో పాఠ్యాంశంగా ‘అమరావతి’ని చేర్చారు.

ఇన్నేళ్లపాటు ఆ పాఠం కొనసాగగా తాజాగా విద్యాశాఖ నూతనంగా ముద్రించిన పదో తరగతి పుస్తకాల్లో ‘అమరావతి’ మిస్సయింది. ఆ పాఠాన్ని తొలగించిన విద్యాశాఖ మరో పాఠాన్ని చేర్చకుండా 11 పాఠాలతో కొత్త పుస్తకాన్ని తీసుకురావడం గమనార్హం. ఈ పుస్తకాలనే అన్ని పాఠశాలలకు సరఫరా చేసింది.  


More Telugu News