75 మందిని పెళ్లాడి.. 200 మందిని వ్యభిచారంలోకి దింపిన ఘరానా మోసగాడి అరెస్ట్
- నిందితుడిది బంగ్లాదేశ్
- సరిహద్దు అధికారులకు రూ. 25 వేల చొప్పున లంచం
- కోల్‌కతా, ముంబైలలో వ్యభిచార కేంద్రాలకు విక్రయం
- ఇండోర్‌లో సెక్స్ రాకెట్ రట్టు కావడంతో మునీర్ పేరు వెలుగులోకి
75 మందిని పెళ్లాడి, 200 మంది యువతులను వ్యభిచార కూపంలోకి దింపిన బంగ్లాదేశ్‌కు చెందిన నిందితుడిని గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని జాసుర్‌కు చెందిన మునీర్ అలియాస్ మునిరుల్ ఉపాధి పేరుతో అక్కడి యువతులను ఇండియాకు అక్రమంగా తీసుకొచ్చేవాడు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ మీదుగా ఈ అక్రమ రవాణా వ్యవహారం సాగేది. యువతులను సరిహద్దు దాటించేందుకు అక్కడి అధికారులకు మునీర్ రూ. 25 వేల చొప్పున లంచం ఇచ్చేవాడు.
ఇండియాకు తీసుకొచ్చిన యువతులను ముంబై, కోల్‌కతాలలో వ్యభిచారంలోకి దింపేవాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 200 మంది యువతులను అక్రమంగా భారత్‌కు రవాణా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే, నిందితుడు మునీర్ ఇప్పటి వరకు 75 మందిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
కాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేయగా, మునీర్ పేరు బయటకు వచ్చింది. మొత్తం 21 మంది యువతులను ఆ మురికి కూపం నుంచి రక్షించిన పోలీసులు అప్పటి నుంచి మునీర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్ పోలీసులకు తాజాగా మునీర్ చిక్కాడు.