బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపశ్రుతి.. అంతరాలయంలో పూలు కట్టేందుకు వెళ్లిన యువకుడి మృతి
- పూలు కట్టేందుకు పైకెక్కిన యువకుడు
- సిపాయి బల్ల కదలడంతో పట్టు తప్పి కిందపడిన వైనం
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అంతరాలయం మండపాన్ని పూలతో అలంకరించేందుకు పైకెక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడి మరణించాడు. షామియానా సిబ్బందిలోని ఓ వ్యక్తి (36) పూలు కట్టేందుకే పైకెక్కాడు.
పూలు అలంకరిస్తున్న సమయంలో అతడు నిల్చున్న సిపాయి బల్ల కదలడంతో పట్టుతప్పి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరి నుంచి కిందపడ్డాడు. దీంతో, భక్తులు నిల్చునేందుకు ఏర్పాటు చేసిన క్యూలోని ఇనుపరాడ్లు అతడి తలకు బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.