రైతులను మోసం చేసేందుకే సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం: జీవీఎల్

  • నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
  • దేశంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • గుంటూరులో బీజేపీ అవగాహన కార్యక్రమం
  • హాజరైన బీజేపీ ఎంపీ జీవీఎల్
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కార్యక్రమానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామినాథన్ సిఫారసుల అమలులో భాగంగానే నూతన సాగు చట్టాలు తీసుకువచ్చినట్టు తెలిపారు. అయితే, రైతులను మోసం చేసేందుకే కొన్ని పార్టీలు సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర దక్కదని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

పంటల కనీస మద్దతు ధరను కేంద్రం ఏటా పెంచుతోందని వెల్లడించారు. పంట కొనుగోళ్లు గతంలో కంటే రెట్టింపు అయ్యాయని వివరించారు. కొత్త చట్టాల సాయంతో రైతులు ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. పంజాబ్ లో ఈ తరహా చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని తెలిపారు. రైతులను పలు రకాలుగా దోచుకునేందుకే మార్కెట్ యార్డులని విమర్శించారు.


More Telugu News