కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన రాజస్థాన్

  • షార్జాలో రాజస్థాన్ వర్సెస్ ముంబయి
  • మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
  • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 రన్స్
  • 24 పరుగులు చేసిన ఓపెనర్ ఎవిన్ లూయిస్
  • నిరాశపరిచిన శాంసన్, దూబే
గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తారని సమీకరణాలు చెబుతున్న నేపథ్యంలో, ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో వీర లెవెల్లో చేజింగ్ చేసి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన రాజస్థాన్... ముంబయితో మ్యాచ్ లో ఆశించిన మేర బ్యాటింగ్ చేయలేకపోయింది.

ఆ జట్టులో అత్యధికంగా ఎవిన్ లూయిస్ 24 పరుగులు చేశాడు. జైశ్వాల్ 12, కెప్టెన్ సంజు శాంసన్ 3, శివం దూబే 3, గ్లెన్ ఫిలిప్స్ 4, డేవిడ్ మిల్ల్ 15, రాహుల్ తెవాటియా 12 పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో నాథన్ కౌల్టర్ నైల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జిమ్మీ నీషామ్ కూడా ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి జట్టు 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 22 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మకు జతగా ఇషాన్ కిషన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.


More Telugu News