రాజస్థాన్ రాయల్స్ పై టాస్ నెగ్గిన ముంబయి ఇండియన్స్
- ఐపీఎల్ లో నేడు కీలక మ్యాచ్
- రాజస్థాన్ వర్సెస్ ముంబయి
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- ప్లే ఆఫ్స్ నాలుగో బెర్తు కోసం గట్టి పోటీ
ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో పలు మార్పులు చేశారు.
వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డికాక్ స్థానంలో ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య స్థానంలో జిమ్మీ నీషామ్ జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ జట్టులోనూ రెండు మార్పులు చేసినట్టు కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించాడు. మయాంక్ మార్కండే స్థానంలో శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటిచ్చినట్టు వివరించాడు.
పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న రాజస్థాన్, ముంబయి జట్లకు ఈ మ్యాచ్ లో విజయం ఎంతో కీలకం. ఇరు జట్లు చెరో 12 మ్యాచ్ లు ఆడి, ఐదేసి విజయాలతో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ లోకి ప్రవేశించాయి. ప్లే ఆఫ్స్ లోకి వెళ్లే నాలుగు జట్ల రేసులో కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ లతో పాటు రాజస్థాన్, ముంబయి కూడా ఉన్నాయి.