బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేస్తాం: ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

  • ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే పోటీ చేస్తున్నాం
  • వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది
  • కేంద్రాన్ని నిలదీయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది
ఏపీలోని బద్వేలు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నిక బరిలోకి తాము కూడా దిగబోతున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో పోటీ చేస్తోందని చెప్పారు. కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో అందరికీ తెలుసని అన్నారు. దాడులకు, దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని చెప్పారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని శైలజానాథ్ విమర్శించారు. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని దారుణమైన స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు.


More Telugu News