వీసీ పోస్ట్ కోసం కేటీఆర్ కు రూ. 2 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి: షర్మిల

  • యూనివర్శిటీలకు కనీసం నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది
  • తెలంగాణ యూనివర్శిటీ సమస్యల నిలయంగా మారిపోయింది
  • తెలంగాణ ప్రజలను సోమరిపోతులు అని కేటీఆర్ అనడం సిగ్గుచేటు
తెలంగాణలో యూనివర్శిటీలకు కనీసం నిధులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ కోసం మంత్రి కేటీఆర్ కు రూ. 2 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. దివంగత వైయస్సార్ వల్ల 2006లో నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్శిటీ ప్రారంభమయిందని... ఇప్పుడు అది సమస్యల విశ్వవిద్యాలయం మాదిరి మారిందని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగాలను 4, 5 శాతం మాత్రమే ఇవ్వగలమని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం సిగ్గు చేటని అన్నారు. తెలంగాణ ప్రజలను సోమరిపోతులు అని కేటీఆర్ అనడం సరికాదని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్లు వేయడానికి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేయించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవసరమా? అని అన్నారు.


More Telugu News