లఖింపూర్ ఖేరీ ఘటనలో కారు కింద నలిగిపోయిన జర్నలిస్టు!
- రైతుల నిరసనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు
- అతనిపై నుంచి దూసుకుపోయిన కారు
- కొడుకు మృతదేహాన్ని గుర్తుపట్టిన తండ్రి
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులు నిరసన చేస్తున్న సమయంలో ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి స్థానిక ఛానల్ కు చెందిన రిపోర్టర్ రమణ్ కశ్యప్ (35) అక్కడకు వెళ్లారు.
ఆ సమయంలో వారిపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ లోని ఒక కారు దూసుకుపోయింది. ఈ కారును అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారు కింద పడి రమణ్ కశ్యప్ నలిగిపోయాడు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం ఎవరిది అనే విషయం కూడా తొలుత ఎవరికీ అర్థం కాలేదు. శవాన్ని అతని తండ్రి గుర్తించిన తర్వాత కానీ అతను ఎవరనే విషయం వెలుగులోకి రాలేదు.
ఈ ఘటనపై రమణ్ తండ్రి రామ్ దులారీ మాట్లాడుతూ... ప్రమాదం జరిగినప్పటి నుంచి తన కుమారుడి ఆచూకీ దొరకలేదని చెప్పారు. మరుసటి రోజు రాత్రి 3 గంటలకు గుర్తు తెలియని మృతదేహం గురించి తనకు ఫోన్ కాల్ వచ్చిందని... తాను మార్చురీకి వెళ్లానని... ఆ మృతదేహం తన కొడుకుదేనని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.