లఖింపూర్ ఖేరీ మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే..!

  • కార్లు దూసుకుపోవడంతో నలుగురు రైతుల మృతి
  • షాక్, అధిక రక్తస్రావం వల్ల చనిపోయారని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడి
  • మృతదేహాల్లో బుల్లెట్ గాయాలు లేవని నివేదిక
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ గ్రామం వద్ద రైతులపై నుంచి కార్లు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు నాలుగు మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక వచ్చింది. వీరంతా షాక్, అధిక రక్తస్రావం వల్లే మరణించారని నివేదికలో పేర్కొన్నారు. రైతుల మృతదేహాల్లో బుల్లెట్ గాయాలు లేవని తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 45 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తామని పేర్కొంది. 


More Telugu News