లక్షరూపాయలు ఎత్తుకెళ్లి రోడ్డుపై వెదజల్లిన కోతి
- ఆటోలో మూటకట్టుకొని పెట్టుకున్న బాధితుడు
- మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
- ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోగా, డబ్బు లాక్కెళ్లిన కోతి
తమ దగ్గర కొంచెం ఎక్కువ మోతాదులో డబ్బు ఉంటే దుస్తుల్లో మూటకట్టుకోవడం ఇప్పటికీ చాలా మందికి అలవాటు. అదే అలవాటు ఒక వ్యక్తి కొంప ముంచింది. అతను టవల్‌లో చుట్టిపెట్టిన లక్ష రూపాయల డబ్బును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయింది. అంతేకాదు ఆ టవల్ విదిలించి డబ్బును రోడ్డుపై వెదజల్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కటవ్ ఘాట్ ప్రాంతంలో జరిగింది.
ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి తన దగ్గరున్న రూ. లక్ష నగదును టవల్‌లో చుట్టి పెట్టుకున్నాడు. మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత సేపటికీ ఆటో కదలకపోవడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులూ కిందకు దిగారు. అప్పుడే దగ్గరలోని చెట్టు మీద ఉన్న ఒక కోతి దిగిన వారిలో ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్‌ను లాక్కెళ్లింది. దానిలో తినడానికి ఏమైనా ఉందనుకుందో ఏమో గట్టిగా విదిలించింది.
అంతే మూటలోని డబ్బు రోడ్డుపై చిందర వందరగా పడింది. ఇంకేముంది.. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన వారిలో చాలా మంది ఆ డబ్బు కోసం ఎగబడ్డారు. కొందరు నిజాయతీపరులు డబ్బు సేకరించి యజమానికి తిరిగిచ్చారు. కానీ చివరకు అతని చేతికి రూ.56 వేలు మాత్రమే దక్కాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో డబ్బు ఎవరు తీసుకున్నదీ తెలుసుకోవడం కుదరలేదని చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలియజేశారు.