సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత.. తొలిసారి స్పందించిన సమంత తండ్రి

  • తన మెదడు శూన్యంగా మారిపోయిందన్న తండ్రి జోసెఫ్
  • ఈరోజు ఇన్స్టా ద్వారా మరోసారి స్పందించిన సమంత
  • ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తనను తాను మార్చుకోవాలని వ్యాఖ్య
వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నామంటూ రెండు రోజుల క్రితం సమంత, నాగచైతన్యలు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీరి ప్రకటనతో అభిమానులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఉండగా... సమంత షూటింగ్ కోసం చెన్నైలో ఉంది. తన కుమార్తె విడాకులు తీసుకోవడంపై సమంత తండ్రి జోసెఫ్ తొలిసారి స్పందించారు. 'నా మెదడు శూన్యంగా మారిపోయింది' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందని నెటిజెన్లు ఆయనను ఓదార్చే విధంగా పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు సమంత కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ... ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తనను తాను మార్చుకోవాలని చెప్పారు. తన పనులన్నీ తానే చేసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం చేయాల్సిన పనులపై శ్రద్ధ పెట్టాలని, బద్దకాన్ని వదిలి బెడ్ పై నుంచి లేచి ముందుకు నడవాలని చెప్పింది.


More Telugu News