'మా' ఎన్నికలపై హీరో శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
- మాపై కొందరు బురద చల్లుతున్నారు
- నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నాను
- 6 నెలల క్రితం ప్రకాశ్‌రాజ్ కలిసి, ప్రణాళిక వివరించారు
- అందుకే పోటీ చేస్తున్నాను
- గత ఎన్నికల్లో నేను ఓడిపోలేదు.. ఓడించారు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఈ రోజు మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన ప్యానెల్ లో ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బెనర్జీ, హేమ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మాట్లాడుతూ... 'మా' అభివృద్ధి ప్రకాశ్‌రాజ్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే సినీ పరిశ్రమలో నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారని చెప్పారు. తెలుగువారంటే మిగతా పరిశ్రమల్లో కూడా గౌరవం ఉందని చెప్పారు. తాము మా అసోసియేషన్ కోసం ఎంత చేసినప్పటికీ తమపై కొందరు బురద చల్లుతున్నారని ఆయన తెలిపారు.
ఈ కారణం వల్లే తాను ఈసారి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకున్నానని, అయితే, ఆరు నెలల క్రితం ప్రకాశ్‌రాజ్ తనను కలిశారని, ఓ ప్రణాళిక గురించి వివరించారని తెలిపారు. మా అభివృద్ధి ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.
పోటీ చేయాలని ఆయన అడగటం వల్లే తాను ఈ సారి పోటీ చేస్తున్నానన్నారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోలేదని, తనను ఓడించారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఓటమి పాలైన చోటే కసితో పని చేద్దామని నిర్ణయించుకున్నానని చెప్పారు. మా శాశ్వత భవనం కలను ప్రకాశ్‌రాజ్ నెరవేర్చుతారని తెలిపారు.