బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
- బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం
- వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోంది
- 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతున్నారు
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని ఆయన అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతోందని ఆయన విమర్శించారు.
బూతులు తిట్టడంలో మాత్రం వైసీపీ నాయకులు పోటీ పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కొడాలి నానికి టీడీపీ రాజకీయ భిక్ష పెట్టిందని, అటువంటిది తమ పార్టీకి ఆయన వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కొడాలి నానికి గుణపాఠం తప్పదని చెప్పారు.
ఏపీ ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని రామ్మోహన్ నాయుడు జోస్యం చెప్పారు. ప్రతి దానిపై ఏపీ ప్రభుత్వం పన్ను వేసి మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన విమర్శించారు.