'మా' ఎన్నికల్లో కేసీఆర్, జగన్, బీజేపీని ఎందుకు లాగుతున్నారు?: మండిపడ్డ ప్రకాశ్ రాజ్
- వైఎస్ జగన్ మీ బంధువైతే మా ఎన్నికలకు వస్తారా?
- రెండు సార్లు హలో అని చెబితే మంత్రి కేటీఆర్ స్నేహితుడు అయిపోతారా?
- ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించాలి
- ప్రత్యర్థులను ఓడించడానికి కాదు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లోకి కేసీఆర్, వైఎస్ జగన్, బీజేపీలను కూడా లాగుతారా? అని ఆయన ప్రశ్నించారు.
వైఎస్ జగన్ మీ బంధువైతే మా ఎన్నికలకు వస్తారా? అంటూ నిలదీశారు. రెండు సార్లు హలో అని చెబితే మంత్రి కేటీఆర్ స్నేహితుడు అయిపోతారా? అని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నించాలని కానీ, ప్రత్యర్థులను ఓడించడానికి కాదని ఆయన హితవు పలికారు. తాము సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నామని చెప్పారు.
తమకు పడే ఓట్లలో మంచు విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుందని ఆయన చెప్పారు. నరేశ్ ఓ అహంకారి అని ఆయన అన్నారు. ఆయన ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలవాలని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రశ్నించే సత్తా తనకి ఉందని, అందుకే తాను ఈసారి ఎన్నికల్లో గెలుస్తానని ఆయన చెప్పారు. తనను నాన్ లోకల్ అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను తెలుగు వాడిని కాదంటూ నరేశ్ వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
తాను తెలుగు మాట్లాడినంతగా మంచు విష్ణు ప్యానల్‌లో ఎవరూ మాట్లాడలేరని ఆయన చెప్పారు. తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చింది తెలుగు భాషేనని ఆయన అన్నారు. మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆత్మాభిమానం ఉందని, ఒకవేళ తాము ప్రశ్నించకపోతే ఈసారి మా ఎన్నికలే ఉండేవి కాదని ఆయన అన్నారు.