మళ్లీ రాజకీయాల్లోకి రాను: మోహన్ బాబు
- ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మోహన్ బాబు వ్యాఖ్యలు
- రాజకీయాలపై అభిప్రాయాలు వెల్లడించిన వైనం
- 99 శాతం రాజకీయాల్లోకి రానని స్పష్టీకరణ
- గతంలో మోదీ తన ఇంటికి పిలిచిన విషయం ప్రస్తావన
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఏబీఎన్ చానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు స్పందిస్తూ, మళ్లీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. 99 శాతం రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని అన్నారు.
ఆ ఒక్క శాతం ఎందుకని ఆర్కే ప్రశ్నించగా, గతంలో ప్రధాని మోదీ తన కుటుంబాన్ని ఢిల్లీ ఆహ్వానించిన విషయాన్ని మోహన్ బాబు గుర్తు చేశారు. మోదీ ఎంతో ఆప్యాయంగా తన కుటుంబాన్ని పిలిచి ఇది నీ ఇల్లే అనుకో, ఎప్పుడైనా రావొచ్చు అని ఆప్యాయంగా చెప్పారని వివరించారు. అందుకే ఒకవేళ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆ ఒక్క శాతం మాత్రం అవకాశం ఉందని మోహన్ బాబు తెలిపారు.
ఇక, తన ప్రాణస్నేహితుడు రజనీకాంత్ కు కూడా రాజకీయాల్లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చానని తెలిపారు. తన సలహాను రజనీకాంత్ కూడా ఆ తర్వాత అంగీకరించాడని వెల్లడించారు.