అతన్ని రాహుల్ కేటగిరీలో చేరుస్తా.. రుతురాజ్‌పై లారా కామెంట్స్

  • రాజస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ చేసిన రుతురాజ్
  • ఇన్నింగ్స్ మలిచిన తీరు అద్భుతమని కొనియాడిన విండీస్ దిగ్గజం
  • సంప్రదాయ షాట్లతో కూడా అదరగొట్టవచ్చని నిరూపించాడని కితాబు
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన యువ ప్లేయర్ రుతురాజ్‌ గైక్వాడ్‌పై దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రయాన్‌ లారా స్పందించాడు. రుతురాజ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. అతను ఇన్నింగ్స్ మలిచిన తీరు అమోఘంగా ఉందని మెచ్చుకున్నాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో రుతురాజ్‌ను కూడా కేఎల్‌ రాహుల్ కేటగిరీలో చేరుస్తానని చెప్పాడు.

తొలి 30 పరుగులు చేయడానికి 29 బంతులాడిన రుతురాజ్ ఆ తర్వాత గేర్లు మార్చిన విధానం అద్భుతంగా ఉందని లారా అభిప్రాయపడ్డాడు. సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడుతూ కూడా భారీ స్కోర్లు నమోదు చేయవచ్చని ఈ యువప్లేయర్ నిరూపించాడని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రుతురాజ్ సెంచరీ వృధా అయింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ విజృంభించడంతో చెన్నై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.


More Telugu News