మంచు విష్ణుకు మద్దతిస్తున్నామని వాళ్లేమైనా చెప్పారా?: ప్రకాశ్ రాజ్

  • ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైనం
  • పెద్దవాళ్ల పేర్లు మేం వాడుకోబోమని మంచు విష్ణుకు చురకలు
  • తమది సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదని స్పష్టీకరణ
నేడు 'మా' సభ్యులతో సమావేశం నిర్వహించిన అనంతరం ప్రకాశ్ రాజ్ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు వెల్లడించారు. మంచు విష్ణు ప్రచారం ముమ్మరం చేశాడని, కృష్ణ, బాలకృష్ణ తదితరులను కలిశాడని, ఇండస్ట్రీలో చాలామంది తమపక్షానే ఉన్నారని మంచు విష్ణు చెబుతున్నారని యాంకర్ పేర్కొనగా, ఎవరు ఎవర్నైనా కలవొచ్చని ప్రకాశ్ రాజ్ బదులిచ్చారు. అయితే, మంచు విష్ణుకే తాము మద్దతు ఇస్తున్నామని వాళ్లేమైనా ప్రకటన చేశారా? అని ప్రశ్నించారు.

"మాది వాళ్లను వీళ్లను కలిసి సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదు. పెద్ద పెద్ద వాళ్ల పేర్లను వాడుకునే ప్యానెల్ కాదు. ఎవర్నైనా కలిసి నేను కూడా సెల్ఫీలు తీయగలను. బాలకృష్ణను కలిసి బొటనవేళ్లు పైకెత్తి చూపించడం అవసరమా? అసలు బాలకృష్ణ ఏంచెప్పారో? ఒకవేళ బాలకృష్ణ మమ్మల్నిందరినీ కాదన్నారని భావించాలా? నా మీదేమైనా ఆయనకి ద్వేషం ఉందా? అది మంచు విష్ణు తీసుకున్న సెల్ఫీ మాత్రమే... బాలకృష్ణ తీసుకున్న సెల్ఫీ కాదు. సెల్ఫీలతో ఎన్నికల్లో గెలవగలమా?.. ఛీ ఛీ!" అంటూ స్పందించారు.


More Telugu News