ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడి అరెస్ట్
- ఎన్సీబీ అధికారుల అదుపులో ఆర్యన్ ఖాన్
- ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు
- కాల్ లిస్ట్, మెసేజ్ చాటింగ్ ల చెకింగ్
- ఎన్సీబీ అదుపులో మొత్తం 8 మంది
- ఎవరున్నా వదిలిపెట్టబోమన్న ఎన్సీబీ చీఫ్
- షూటింగ్ ను వాయిదా వేసుకున్న షారూక్
ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆదివారం ఉదయం ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. అతనితో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. మున్మున్ ధమేచా, నుపుర్ సరికా, ఇస్మీత్ సింగ్, మొహాక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్ లు ప్రస్తుతం ఎన్సీబీ అదుపులో ఉన్నారు. వారిలో ఇద్దరు ఢిల్లీ, హర్యానాకు చెందిన డ్రగ్స్ సరఫరాదారులున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా నవీముంబైలోని బేలాపూర్ లోని పలు చోట్ల ఎన్సీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.
కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని ఎన్సీబీ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ చెప్పారు. కేసులో ఎవరున్నా వదిలపెట్టబోమన్నారు. బాలీవుడ్, ధనికులకు సంబంధాలున్నాయని తేలితే కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలో డ్రగ్స్ కేసుకు సంబంధించి 300 దాడులు జరిగాయన్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఎండీఎంఏ, ఎక్స్ టసీ డ్రగ్, కొకైన్, మెఫిడ్రన్, చరస్ వంటి డ్రగ్స్ ను రేవ్ పార్టీలో వాడినట్టు చెప్పారు.
ఆర్యన్ ఖాన్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారులు అంటున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆధారాల కోసం ఫోన్ లోని డేటాను తీసుకుంటున్నట్టు తెలిపారు. మెసేజ్ లు, ఫోన్ కాల్ లిస్ట్ ను చెక్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో షారూక్ తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకున్నాడు. స్పెయిన్ లో పఠాన్ సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. దీపికా పదుకొణెతో ఓ సాంగ్ చిత్రీకరణ చేయాల్సి ఉంది. అయితే, ఆర్యన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేయడంతో ఆయన ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్టు షారూక్ సన్నిహితులు చెబుతున్నారు.