బతుకమ్మ పాటను రూపొందించిన ఏఆర్ రెహమాన్.. భూదాన్ పోచంపల్లిలో చిత్రీకరణ
- ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం
- బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే విడుదల
- ఇతర భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు
తెలంగాణ బతుకమ్మ పాట అంతర్జాతీయ స్థాయికి ఎదగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. ప్రముఖ గాయని పాడిన ఈ పాటను యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి సమీపంలో గత నెల 29, 30 తేదీలలో చిత్రీకరించారు.
ఈ వీడియో నాలుగు నిమిషాల నిడివి ఉండే అవకాశం ఉంది. రెహమాన్, గౌతమ్ మీనన్ కలిసి ఈ పాటను చిత్రీకరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ లోపే ఈ పాటను విడుదల చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ పాటను ఇతర భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.